నిమిషం ఆలస్యం చేయలే.. | - | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యం చేయలే..

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

సీఎస్‌ ప్రశంసలు

ఫోన్లదే కీలక పాత్ర..

చెట్టుపై ఉన్న వ్యక్తిని

డ్రోన్‌ సాయంతో గుర్తించాం..

ప్రాణాలకు తెగించి శ్రమించిన

ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

‘సాక్షి’ ఇంటర్వ్యూలో లెక్టర్‌ దివాకర

సాక్షిప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులు, వారిని రక్షించేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగారు. సుమారు 14 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. రాత్రంతా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సాగిన వైనాన్ని శుక్రవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు కలెక్టర్‌ మాటల్లోనే...

ఫోన్‌ రాగానే పయనం

మురసు తుపాను ప్రభావంతో ఈనెల 4న వర్షం కురుస్తుండగా సాయంత్రం 6 గంటల సమయాన ఫోన్‌ వచ్చింది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వరదలో జాలర్లు చిక్కుకున్నారని తెలియడంతో హుటాహుటిన ఖమ్మం నుంచి బయలుదేరా. నాతోపాటు ముఖ్య అధికారులు, కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు వచ్చారు. భద్రాద్రి జిల్లా నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 11 మంది తొలుత ముగ్గురిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. మిగిలిన వారిని కాపాడేందుకు వెళ్లే సమయాన బోట్లు బోల్తా పడ్డాయని అప్పటికే వరదలో ఉన్న జాలర్లు వారి ఫోన్ల ద్వారా తెలిపారు.

తొలుత ఐదుగురిని...

ఈనెల 4న బుధవారం రాత్రి ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టగా.. వరదలో చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి ఐదుగురిని రక్షించగలిగాం. మరో ముగ్గురు ప్రమాదకరమైన లొకేషన్‌లో ఉన్నారు. అక్కడ వరద ఎక్కువగా ఉండడం, లోతు అంచనా వేసే పరిస్థితి లేకపోగా బోటు వెళ్లలేని పరిస్థితి ఉంది. అప్పటికే గురువారం తెల్లవారుజాము 3–30 గంటలు అయింది. చిమ్మచీకట్లు ఉండడంతో ఆపరేషన్‌కు బ్రేక్‌ ఇచ్చాం. మళ్లీ 5–30గంటలకు చెరువులోకి వెళ్లిన బృందాలు ఐదుగురిని రక్షించి తీసుకొచ్చాయి.

రోప్‌ సాయంతో..

మొత్తం పది మందిని రక్షించగా, మరో వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నట్లు డ్రోన్‌ సాయంతో గుర్తించాం. ఆయనను రక్షించడంపై కసరత్తు చేయాల్సి వచ్చింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కొందరు బోట్ల సాయంతో వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరకు వరద ఉధృతి ఉన్నప్పటికీ సిబ్బంది ధైర్యం చేసి బోట్‌ కాకుండా రోప్‌ వేసుకొని ఒకరికి ఒకరు పట్టుకుంటూ ధైర్యంగా వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. గురువారం ఉదయం 8గంటల కల్లా అందరూ సురక్షితంగా బయటకు రాగా, బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్‌ పూర్తయ్యేవరకు ఎవరం నిద్ర పోలేదు. అందరినీ ప్రాణాలతో ఎలా తీసుకురావాలనే ఆలోచనలతోనే గడిపాం.

సమన్వయంతో సాధ్యమైంది..

జాలర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు. అందరి మధ్య సమన్వయం, వనరుల సమీకరణ, సమష్టి కృషితో ఈ పని పూర్తయింది. దీనికి తోడు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచనలు ఉపయోగపడ్డాయి. మేము తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలను ఇచ్చాయి. అధికారులు సరైన రీతిలో స్పందించడం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వద్ద అత్యాధునిక పరికరాలు ఉండడం, వారు ధైర్యంగా సమన్వయంతో పనిచేయడం కలిసివచ్చింది.

బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న జాలర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కాపాడడంలో కీలకంగా వ్యవహరించిన కలెక్టర్‌ దివాకరను సీఎస్‌ సంజయ్‌జాజు ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు సమన్వయంతో రాత్రింబవళ్లు శ్రమించి అందరినీ రక్షించారని ప్రశంసించారు. తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై వీసీ ద్వారా సమీక్షించిన సీఎస్‌.. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్‌ ప్రదర్శించిన నాయకత్వం ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల వద్ద ఫోన్లు ఉన్నాయి. నీటిలో పడినా ఆ ఫోన ్లకు ఏమీ కాలేదు. ఇది మాకు అదృష్టమనే చెప్పాలి. రాత్రి సమయాన రెస్క్యూ చేయడానికి ఫోన్‌ లొకేషన్‌ కీలకంగా మారింది. మాకు ఉన్న

ఏకై క ఆధారం కూడా ఇదే. రాత్రి వేళ డ్రోన్‌ ఎగరేసినా 100 మీటర్ల కన్నా ఎక్కువ విజన్‌ స్పష్టంగా కనిపించలేదు. ఫోన్‌ లొకేషన్‌ వల్ల ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారో

తెలిసిపోయింది.

బేతుపల్లి చెరువు ఘటనలో కీలకంగా ఫోన్‌ సిగ్నళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement