గడువులోగా సీఎంఆర్‌ అందించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సీఎంఆర్‌ అందించాల్సిందే..

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

● అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం సహకారనగర్‌: 2024–25 రబీ, 2025–26 ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం(సీఎంఆర్‌) గడువులో గా అందించాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో మిల్లర్లను డీపాల్ట్‌గా పరిగణిస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ కార్యాలయ జీఎం రాజేందర్‌, డీజీఎం ఇర్ఫాన్‌తో కలిసి అధికారులు, మిల్లర్లతో సమావేశమయ్యారు. జిల్లాలో 1.25 లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉండగా, అందులో 1.06 లక్షల మెట్రిక్‌ టన్నులు సివిల్‌ సప్లయీస్‌ శాఖకు అందించాల్సి ఉందని తెలిపారు. ఈ బియ్యాన్ని వచ్చే ఏడాది జనవరి 31లోగా అందించాలని, ప్రతీనెల కనీసం 35 వేల మె.టన్నులు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. మిల్లర్లకు రావా ల్సిన మిల్లింగ్‌, రవాణా చార్జీల బిల్లులు సత్వరమే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం మల్లికార్జునబాబు తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో

అత్యవసర మందులు

● డీఎంహెచ్‌ఓ రామారావు

ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. ఇదే సమయాన అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఫార్మసిస్టులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఫార్మసిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుక్కకాటు, పాముకాటు నివారణ మందులను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని, మందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్‌ అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని తెలి పారు. అలాగే, ఆస్పత్రులకు వచ్చే కిశోర బాలికలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించి, రక్తహీనత లోపం ఉన్నవారికి మందులు ఇవ్వాలని, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తూ వ్యాక్సిన్ల నాణ్యత దెబ్బతినకుండా భద్రపర్చాలని సూచించారు. అలాగే, ఉద్యోగులు హాజరును యాప్‌ ద్వారానే నమోదు చేయాలని స్పష్టం చేశారు. డీఐఓ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, అధికారులు సుబ్రహ్మణ్యం, రమణ, నాగమణి పాల్గొన్నారు.

డిజిటల్‌ విధానంలోనే ప్రభుత్వ పాలన

● జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి

ఖమ్మంసహకారనగర్‌: పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు సేవల్లో వేగం పెంచేలా ప్రభుత్వం డిజిటల్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు వివరాలు మొదలు, ఆర్థిక అనుమతులు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఖజానా శాఖ ఉద్యోగులకు అవగాహన కల్పించగా డీఆర్వో మాట్లాడుతూ ఉద్యోగి నియామకం నుంచి పదవీ విరమణ వరకు పదోన్నతులు, సెలవులు, బదిలీలు తది తర వివరాలన్నీ ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, అభివృద్ధి పనుల అనుమతులు, కాంట్రాక్టు ఒప్పందాలు, పనుల పురోగతి పర్యవేక్షణ, బిల్లుల మంజూరు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, జిల్లా ఖజా నా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ వై. శ్రీనివాసరెడ్డి, పే అండ్‌ అకౌంట్స్‌ అధికారి కె.రామ్‌ ఆధ్వర్యాన 650 మంది ఖజానా శాఖ ఉద్యోగులకు మూడు మాడ్యూళ్లపై శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వీటి అమలుతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారంలో వేగం పెరిగి, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. వైరా ఏటీఓ ప్రసన్నకుమార్‌, ఎస్‌టీఓలు మోదు గు వేలాద్రి, నాగేంద్రకుమారి, వెంకటేశ్వర్లు, సునీల్‌, విజయసారథి, రాధికారెడ్డి పాల్గొన్నారు.

జిల్లాలో

ముగ్గురు ఎస్సైల బదిలీ

ఖమ్మం క్రైం: జిల్లాలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ సునీల్‌దత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కొణిజర్ల, కారేపల్లి, వైరా ఎస్సైలు సూరజ్‌, గోపి, రామారావును వీఆర్‌కి బదిలీ చేశారు. వీరి స్థానంలో సీసీఆర్బీ ఎస్సై హరితను కొణిజర్లకు, మహబూబాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న ప్రవీణ్‌ను వైరాకు, ఖమ్మం టూ టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌ను కారేపల్లికి కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement