తుపాన్‌ నష్టంపై అంచనాలు | - | Sakshi
Sakshi News home page

తుపాన్‌ నష్టంపై అంచనాలు

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

ఖమ్మంఅర్బన్‌: మురసు తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యాన పలుచోట్ల రహదారులు, చెరువు కట్టలు దెబ్బతిన్నాయి. ఈమేరకు నష్టాన్ని అంచనా వేసేందుకు జలవనరులు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కాగా, జిల్లాలోని సత్తుపల్లి డివిజన్‌ పరిధిలో వర్షం భారీగా కురవడంతో పలు చోట్ల చెరువుకట్టలు, రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

రోడ్డు మరమ్మతుకు రూ.కోటి

ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని తాళ్లమడ – నారాయణపురం రహదారిపై వరదనీరు భారీగా చేరడంతో రోడ్డు కోతకు గురైంది. దీంతో మరమ్మతులకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే బేతపల్లి చెరువు అలుగు వద్ద దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులకు సుమారు రూ.15 లక్షలు అవసరమవుతాయని భావిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో పరిశీలన పూర్తయ్యాక అవసరమైన నిధులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు.

సత్తుపల్లి డివిజన్‌లో అధిక ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement