ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోన్ క్రికెట్ పోటీలు శుక్రవారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ పోటీలను ఉమ్మడి జిల్లా క్రీడల కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న ప్రారంభించారు. తొలిరోజు మ్యాచ్‌ల్లో భాగంగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ జట్టు కేడీసీ జట్టుపై, కేఎండీసీ జట్టు కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీ జట్టుపై, పాల్వంచ కాలేజీ జట్టు మణుగూరు టీడబ్ల్యూఆర్డీసీ జట్టుపై విజయం సాధించాయి. కాగా, నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో ఫైనల్స్‌కు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు చేరుకోగా, ఖమ్మం కేఎండీసీ, కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈకార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు జి.విల్సన్, జె.ఉపేందర్, కోటి, గోపి తదితరులు పాల్గొన్నారు.


