రూ.1.75లక్షల విలువైన టపాసులు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.1.75లక్షల విలువైన టపాసులు స్వాధీనం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

ఖమ్మంక్రైం: దీపావళి పండుగ నేపథ్యాన నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ చేసి విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఖమ్మం బుర్హన్‌పురలోని నాగ వెంకటసాయి కిరాణ దుకాణంలో టపాసులు నిల్వ చేశారనే సీఐఉదయ్‌ కుమార్‌ ఆధ్వర్యాన తనిఖీ చేయగా, రూ.1.75 లక్షల విలువైన టపాసులు లభించాయి. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అనుమతి లేకుండా టపాసుల నిల్వ, విక్రయాలు చట్టరీత్యా నేరమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement