ఖమ్మం స్పోర్ట్స్: కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి అండర్ –19 కరాటే పోటీలు శుక్రవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, డీఐఈఓ రవిబాబు ప్రారంభించి మాట్లాడారు. కరాటేలో రాణించ డం ద్వారా విద్యార్థుల్లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. కాగా, వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు హాజరు కాగా, బాలబాలికలు కటా, స్పారింగ్ విభాగాలు పోటీల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిభ చాటే క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమంలో అండర్ –19 క్రీడా సంఘం కార్యదర్శి మూసా కలీం, కరాటే మాస్టర్ గోపతి సైదులు, మార్కెట్ డైరెక్టర్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
కల్తీ మద్యం విక్రయాల కలకలం
నేలకొండపల్లి:నేలకొండపల్లిమండలంలోని పలు గ్రామాల్లో అసలు బ్రాండ్‌నుపోలిన నకిలీ మద్యం అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరా బాద్ కేంద్రం తయారవుతున్న ఈమద్యాన్ని తీసు కొచ్చి విక్రయిస్తున్నట్లు తెలిసింది. తద్వారా జనం ఆరోగ్యం దెబ్బ తింటుండగా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని చెబుతున్నారు. కాగా, నకిలీమద్యం అమ్మకాలపై శుక్రవారం ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎ ల్ లైజనింగ్ ఆఫీసర్ ధీరావత్ కోటేశ్వరరావు తెలి పారు. ఈ విషయమై ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని వివరణకోరగా విషయం తమదృష్టికి రాలేదని తెలిపారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయి లో సమగ్ర విచారణ చేయిస్తామని వెల్లడించారు.
బాల్య వివాహాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి
ఖమ్మంమయూరిసెంటర్: బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీపీఓ టి.విష్ణువందన సూచించా రు. ఖమ్మంలోని జిల్లా సమాఖ్య సమావేశ హాల్‌లో అడిషనల్ డీఆర్‌డీఓజయశ్రీ, డీడబ్ల్యూ ఓ ప్రమీల ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహా ల నిర్మూలనలో మహిళా సంఘాల సభ్యులు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. బాలిక ల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై కలిగే ప్రతి కూల ప్రభావాలపై అవగాహన పెంచుకుని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1098 లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. టీఓ ఎస్ కోఆర్డినేటర్ మంగపతి, డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
పురస్కారాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులైన దివ్యాంగులు, సేవకులు, స్వచ్ఛంద సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఏ.ప్రమీల తెలిపారు. అవార్డులకు సంబంధించి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం కోసం https:// depwdsctgp. telangana. gov. in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈనెల 16లోగా దరఖాస్తులను తగిన ఽధ్రువీకరణ పత్రాలతో తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.


