పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశంలో ప్రజాస్వామ్య రక్షణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వచ్చేనెల 29న ఛలో హైదరాబాద్‌ నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వెల్లడించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు చోర్‌, నోటు చోర్‌, రిజల్ట్‌ చోరీ, జిందగీ చోర్‌ గా మారిన మోదీ సర్కార్‌ను సాగనంపితేనే దేశానికి రక్షణ ఉంటుందని తెలిపారు. ‘సర్‌’ ప్రక్రియతో దేశంలో సుమారు 13 కోట్ల మంది దళితులు, ఆదివాసీలు, ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, ఇందులో కీలకమైన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ జ్ఞానేష్కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ర్యాలీ తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆ పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, గత ప్రభుత్వ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని విమర్శించా రు. కరువుబారిన పడిన ప్రాంతాల్లో దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడమే కాక కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని, సీతారామ ప్రా జెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వ ర్లు, జి.రామయ్య, మలీదు నాగేశ్వరరావు, బందేల వెంకయ్య, ఆర్‌.శివలింగం, కోలేటి నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, ఝాన్సీ, శోభ పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి

పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement