సత్తుపల్లిరూరల్: మడలంలోని కిష్టారం సమీపాన ఈ నెల 2న జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన పద్దం రాధాకృష్ణ(30) గురువారం రాత్రి మృతి చెందగా ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈనెల 2న పెనుబల్లి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కొరసా రాము(25), కాక నరసింహారావుతో పాటు రాధాకృష్ణ బైక్‌పై సత్తుపల్లి వస్తుండగా, కిష్టారం సమీపంలో గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టింది. ఘటనలో రాము అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి సత్తుపల్లిలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా రాధాకృష్ణ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకునే తరుణాన రాధాకృష్ణ మృతితో తల్లిదండ్రులు రాములు – సరోజిని కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించాలని కుటుంబీకులు కోరుతున్నారు.
మైనర్ బాలికపై లైంగిక దాడి
గర్భం దాల్చిన బాధితురాలు, నిందితుడిపై పోక్సో కేసు
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామపంచాయతీ పరిధిలో దారుణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 14ఏళ్ల గిరి జన బాలిక పొరుగు జిల్లాలోని హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. కొద్దినెలల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే క్రమాన కుటుంబీకులు అదే గ్రామానికి చెందిన బోడ రమేష్‌తో బైక్‌పై పంపించారు. వివాహితుడైన ఆయన మార్గమధ్యలో మాయమాటలు చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో ఆమెతల్లి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆమె ను నిలదీయగా బోడ రమేష్ కారణమని చెప్పడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు కూసుమంచి సీఐ సంజీవ్ వెల్లడించారు.


