‘పాఠశాలలకు మరణ శాసనంగా జీఓ 25’ | - | Sakshi
Sakshi News home page

‘పాఠశాలలకు మరణ శాసనంగా జీఓ 25’

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

రఘునాథపాలెం/వేంసూరు: ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిన జీఓ 25ను తక్షణమే సవరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రఘునాథపాలెం, వేంసూరులో శుక్రవారం జరిగిన మండలాల కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రతీ ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, 50 మంది విద్యార్థులు ఉంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని కోరారు. అంతేకాక హెచ్‌ఎంలపై యాప్‌ల భారం తొలగించి ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు కల్పించాలన్నారు. అలాగే, సర్వీసు నిబంధనల సమస్య పరిష్కారం, ఉపాధ్యాయుల పదోన్నతులు, పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కాగా, త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ తరపున పోటీ చేస్తున్న కొల్లి సత్యనారయణ గెలుపునకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈసమావేశాల్లో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రంజాన్‌, మండలాల అధ్యక్షులు వర్ల ప్రసాద్‌, గుత్తా శ్రీనివాసరావుతో పాటు నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, వీ.వీ.రామారావు, ఈశ్వరాచా రి, మురళీమోహన్‌, సూరయ్య, శ్రీనివాసరావు, దీన్‌దయాళ్‌, రవి, సక్రాం, సతీష్‌, శేషగిరి, శారద, రవీందర్‌, పుల్లయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement