యువజనోత్సవం జోష్‌ | - | Sakshi
Sakshi News home page

యువజనోత్సవం జోష్‌

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● కళకళలాడిన భక్త రామదాసు కళాక్షేత్రం ● పోటీలను ప్రారంభించిన డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి

● కళకళలాడిన భక్త రామదాసు కళాక్షేత్రం ● పోటీలను ప్రారంభించిన డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి

ఖమ్మం రాపర్తినగర్‌: డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో యువజనోత్సవం ఉత్సాహంగా సాగింది. జిల్లా స్థాయి యువజనోత్సవాల సందర్భంగా పోటీలను జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జానపద నృత్యాలు, పాటలు, ఇతరత్రా పోటీల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో సహజసిద్ధంగా ఉండే సృజనాత్మకత, ప్రతిభ ప్రస్తుతం వెలుగు చూడడం లేదని తెలిపారు. ఈమేరకు వారిని ప్రోత్సహించేలా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి మాట్లాడగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.డీ.జాకీరుల్లా, మేరా యువ భారత్‌ కోఆర్డినేటర్‌ ఎం.వెంకటరాంబాబు, అధికారులు ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ బి.వెంకన్న, వెంకటేశ్వర్లు, హరిబాబు, చందన, అంబిక, శైలజ, డాక్టర్‌. జ్యోతి, అంజలి, పి.రవికుమార్‌, యువజన సంఘాల అధ్యక్షుడు సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతల వివరాలిలా ఉన్నాయి. జానపద నృత్యంలో కూసుమంచి టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల, ఖమ్మం అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల, జానపద గేయాల్లో ఖమ్మం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, ఖమ్మం డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక వీధి నాటకంలో ఖమ్మం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ, మమత నర్సింగ్‌ కళాశాల, పోస్టర్‌ పెయింటింగ్‌లో జి.నీల(ఆర్‌జేసీ కాలేజీ, ఖమ్మం), అంజలి(జీజేసీ, ముదిగొండ), కవిత్వంలో వి.సాహితి(హార్వెస్ట్‌ జూనియర్‌ కళాశాల) బహుమతులు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement