తూకంలో తేడా ఉండడంతో చర్యలు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ నిర్దేశిత ధరలకే బియ్యం విక్రయించడంతో పాటు తూకం, నిల్వల్లో తేడాలు రావొద్దన్న కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ఈమేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు శుక్రవారం ఖమ్మంలోని పలు షాపుల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం బస్తాపై ముద్రించిన బరువు కంటే తక్కువగా ఉన్నట్లు తేలగా పలు షాపుల్లో 53 బస్తాలను సీజ్ చేసి, వ్యాపారులకు రూ.96వేల జరిమానా విధించారు. మామిళ్లగూడెంలోని లక్ష్మీ వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ మర్చంట్, శ్రీ లక్ష్మీ బాలాజీ కిరాణా అండ్ జనరల్ స్టోర్, కస్బాబజార్‌లోని షేక్ జానీమియా రైస్ స్టోర్స్, సుపీరియర్ ఎంటర్‌ప్రైజెస్‌కు జరి మానా విధించామని డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు. తనిఖీల్లో పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన టపాసులు స్వాధీనం
ఖమ్మంక్రైం: దీపావళి పండుగ నేపథ్యాన నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ చేశారనే సమాచారంతో ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం చర్చి కౌంపౌండ్ రోడ్డులో నల్లా బాలకృష్ణ నివాసంలో సీఐ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యాన తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన రూ.లక్ష విలువైన టపాసులు లభించాయి. ఈమేరకు కేసు విచారణ నిమిత్తం ఖమ్మం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కేటగిరీలు ఖరారు
ఖమ్మం స్పోర్ట్స్: జూనియర్ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అండర్–17 రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో తొలి రోజు బరువు ఆధారంగా క్రీడాకారుల కేటగిరీలు ఖరారు చేశారు. మొత్తం 350మంది క్రీడాకారులు హాజరుకాగా, తొమ్మిది కేటగిరీ లుగా విభజించామని నిర్వాహకులు గోపతి సైదులు తెలిపారు. కాగా, పోటీలు అధికారికంగా శుక్రవారం ప్రారంభమవుతాయని సంఘం కార్యదర్శి మూసాకలీం తెలిపారు.
గోదాంలోకి వరద,
తడిసిన ఎరువులు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ పార్క్ సమీపంలోని ఎరువుల గోదాంలోకి వరద చేరింది. స్థానిక వేశ్యకాంతల చెరువు వరద బుధవా రం రాత్రి గోదాంలోకి చేరగా ఎరువుల బస్తాలు తడిశాయి. ఈమేరకు పార్థసారథి ట్రేడర్స్‌కు చెందిన 470ఎరువుల బస్తాలు తడవడంతో సు మారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు కొండపల్లి రమేష్‌రెడ్డి తెలిపారు.
తుపాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: మురసు తుపాన్‌తో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, సీపీఐ జాతీయ సమితి సభ్యు డు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. తుపాన్‌తో ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, పెనుబల్లి, కల్లూరు, దమ్మపేట, తల్లాడ, సుజాతనగర్, పాల్వంచ, కొణిజర్ల మండలాల రైతులు వరి, పత్తి నష్టపోయారని తెలి పారు. ఈమేరకు సమగ్ర సర్వే చేయించాలని కోరారు. వరి ఎకరానికి రూ.30వేలు, వాణిజ్య పంటలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
జీజీహెచ్‌లో
‘బేటీ జన్మోత్సవ్’
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ‘బేటీ జన్మోత్సవ్’ వేడుకలు నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల మాట్లాడుతూ ఆడశిశువు పుట్టుకను స్వాగతించడం, సమాజంలో బాలికలపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. కుటుంబం, సమాజానికి విలువైన ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళలకు కిట్లు అందజేశారు. సాధికారిత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ సమ్రీన్‌తో పాటు వాసంతి, సతీష్, వరలక్ష్మి, స్వరూపారాణి, శైలజ, సౌజన్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.


