పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

కొణిజర్ల/ఖమ్మం రూరల్‌: దేశంలో రోజురోజుకు నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్‌తో పాటు ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెంలో గురువారం అమరవీరుల వర్థంతి సభలు నిర్వహించగా అరుణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సభల్లో రంగారావు మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం దేశ సంపద, ప్రజల శ్రమశక్తిని పాలకులు కారుచౌకగా తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈమేరకు అమరుల పోరాటాల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామ్య విప్లవమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం కల్పించాలని, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. కాగా, దేశంలో దాదాపు 13.80 కోట్ల మంది ఓట్లను తొలగించడం ద్వారా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కనుసన్నల్లో సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ నడుస్తున్నారని బయటపడిందన్నారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, బందెల వెంకయ్య, మలీదు నాగేశ్వరరావు, వై.ఉపేందర్‌, గుగులోతు శివ, కోయల శ్రీను, కుడుం ఝాన్సీ, ఎస్‌.కే.లాల్‌మియా, పాఽశం అప్పారావు, సీతారాములు, లక్ష్మీనారాయణ, వెంకన్న, వీరబాబు, జ్యోతి, అప్పమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement