చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

కల్లూరు రూరల్‌: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన మర్సకట్ల శేఖర్‌ ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి దుబారా ఖర్చులు చేస్తుండటంతో భార్య రాణి వారించింది. ఈక్రమాన ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా, శేఖర్‌ గతనెల 23వ తేదీన పురుగుల మందు తాగాడు. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా గురువారం మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

బైక్‌ కొనివ్వలేదని

యువకుడు ఆత్మహత్య

ఖమ్మంక్రైం: స్పోర్ట్స్‌ బైక్‌ కావాలని అడిగితే తండ్రి కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన ధరావత్‌ జశ్వంత్‌తేజ(20) ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతూ సారధినగర్‌ ప్రాంతంలోని అద్దె గదిలో ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఆయన తనకు స్పోర్ట్‌ బైక్‌ కావాలని తండ్రిని అడుగుతుండగా, ఈ ఏడాది కరువుతో పంటలు లేనందున మరేదైనా బైక్‌ తీసుకోవాలని నచ్చచెప్పాడు. అయినా జశ్వంత్‌ స్పోర్ట్‌ బైక్‌ కోసం పట్టుబట్టడంతో తన వల్ల కాదని తండ్రి చెప్పారు. ఈక్రమాన గత నెల 14న అద్దె గదిలో గడ్డి మందు తాగిన జశ్వంత్‌ను స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈమేరకు పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు, ఘటనపై ఆయన సోదరుడు చరణ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement