ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్(పీటీఎం) విజయవంతంగా కొనసాగింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడంతో పాటు అభ్యసన సామర్థ్యాలు పెంచడంలో వారిని భాగస్వాములుగా చేయడం, పాఠశాలలు – ఇళ్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో సమావేశాలకు 19 వేల మంది తల్లిదండ్రులు హాజరయ్యారని వెల్లడించారు. డీఈఓ వాసంతి సత్తుపల్లి మండలంలోని పలు పాఠశాలలల్లో సమావేశాలను పరిశీలించారు. అలాగే, విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బాజోజు ప్రవీణ్‌కుమార్ కూడా పలు పాఠశాలను సందర్శించారు.


