పరిశీలించిన రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ నాగరాజు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈక్రమాన క్షేత్రం పరిసరాల్లో బౌద్ధులు నడియాడిన నేల, నివాసం ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ పి.నాగరాజు ఆధ్వర్యాన గురువారం పరిశీలించారు. బౌద్ధక్షేత్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుండగా, పరిసర ప్రాంతాలు, భూములను పరిశీలించడమే కాక బైరాగిగుట్ట ప్రాంతంలో వివరాలు ఆరా తీశారు. అనంతరం డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ బౌద్ధుల నివాసానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నందున భవిష్యత్‌లో తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక్కడ పరిశీలన కోసం ఆర్కియాలజీ నిపుణులు షిండే శనివారం రానుండగా, మాస్టర్ ప్లాన్‌పై చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గంగాదేవి, జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, తహసీల్దార్ పి.రాంప్రసాద్, రాయగూడెం సర్పంచ్ బోయిన వేణు, జీపీఓ జానీమియాతో పాటు మరికంటి వెంకట్, కే.వై.రామచందర్‌రావు, దుడ్డెల రవికుమార్ పాల్గొన్నారు.


