● ఎస్‌హెచ్‌జీల ప్రొఫైల్ మానిటరింగ్ వేగవంతం ● ఆన్‌లైన్‌లో పరిశీలనతో పారదర్శకత ● జిల్లాలో కొనసాగుతున్న ఆమోద ప్రక్రియ
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా సాధికారత వైపు నడిపించేలా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీలు)కు ప్రభుత్వాలు రుణసాయం అందిస్తున్నాయి. బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు అందుతుండగా.. వీటి మంజూరు, చెల్లింపుల్లో అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రొఫైల్ మానిటరింగ్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘లోకోస్ యాప్’ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టనున్నారు. జిల్లాలో ఈ–కేవైసీ నమోదు ప్రక్రియను గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ముమ్మరం చేశారు.
వివరాలు సమగ్రంగా..
లోకోస్ యాప్‌లో సంఘంలోని ప్రతీ సభ్యురాలి ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్, బుక్ కీపర్ వివరాలను నమోదు చేస్తారు. అధికారులు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను నమోదుకు ఆమోదం తెలుపుతున్నారు. భవిష్యత్‌లో అర్హులైన మహిళలకే ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఖమ్మం రూరల్ అగ్రస్థానం..
జిల్లా వ్యాప్తంగా ప్రొఫైల్ మానిటరింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఖమ్మం రూరల్ మండలంలో 1,011 సంఘాలకు చెందిన 10,364 మంది సభ్యుల ప్రొఫైళ్లను నమోదు చేయగా, జిల్లాలో మొదటి స్థానాన నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కొణిజర్ల మండలంలోని 589 సంఘాలకు చెందిన 6,435 మంది సభ్యులు, కల్లూరులో 588 సంఘాలకు చెందిన 7,648 మంది సభ్యుల వివరాలను యాప్‌లో నమోదు చేశారు.
పెండింగ్ ప్రక్రియపై దృష్టి..
యాప్‌లో నమోదు కాని సంఘాల సభ్యుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయిలో 516 సంఘాలకు సంబంధించి 4,845 మంది సభ్యులు వివరాలు పరిశీలన దశలోనే ఉన్నాయి. సాంకేతిక లోపాలు, సరిపోలని వివరాల కారణంగా 535 సంఘాలకు సంబంధించి 3,088 మంది సభ్యులు వివరాలు తిరస్కరణకు గురయ్యాయి. వీటితో పాటు బుక్ కీపర్ మ్యాపింగ్‌కు సంబంధించి 13,759 సంఘాలకు సంబంధించి 90,113 మంది సభ్యుల వివరాలు ఆమోదించాల్సి ఉంది. సమాచారంలో తప్పులు లేకుండా సరిచేసి, తిరస్కరణకు గురైన ప్రొఫైళ్లను పునఃపరిశీలించాలని డీఆర్‌డీఏ అధికారులు సిబ్బందిని ఆదేశించారు.
లోకోస్ యాప్ ప్రొఫైల్


