విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకుడు పగడాల నాగరాజు ఆరోపించారు. రఘునాథపాలెం మండలం గణేష్‌పాడుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిఅజయ్‌ శుక్రవారం ఖమ్మంలోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో మృతి చెందిన విషయం విదితమే. ఈమేరకు ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అజయ్‌ మృతిపై అనుమానాలు ఉన్నందున, విచారణ చేపట్టి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి చేరుకుని నాయకులు, బాధిత కుటుంబీకులతో చర్చించారు. కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా, బీసీ సంక్షేమ శాఖ డీడీ జ్యోతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. సుడా మాజీ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, గుత్తా రవి, రవికిరణ్‌, పిన్ని కోటేశ్వరరావు, యాస రామారావు, భరత్‌, రాంబాబు, లావణ్య, మెంటం రామారావు, పాషా మాటేటి కిరణ్‌, చిన్నం మల్లేశం, పగడాల మధు, మోటె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రి మార్చురీ వద్ద నేతల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement