ఖమ్మంమయూరిసెంటర్: దేశ సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన నేత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో దేశ మొదటి ప్రధాని ఇందిరాగాంధీ వర్ధతి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాక సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరాగాంధీ తన త్యాగాలతో దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు బానోత్ బాలాజీనాయక్, గజ్జెల్లి వెంకన్న, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, రంగా జనార్దన్, కొట్టే రాజశేఖర్, కాజా మురళి, గజ్జి సూర్యనారాయణ, ఫజల్, రమణ, ధోన్‌వాన్ వెంకట్రావు, తలారి నాగభూషణం, తీగల రాము పాల్గొన్నారు.
భట్టిపై ఆరోపణలు గర్హనీయం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై సీపీఎం నాయకులు చేస్తున్న నిరాధార, అసత్య ఆరోపణలు గర్హనీయమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. సీపీఎం జిల్లా నాయకత్వం ఉనికి కోల్పోవడంతోనే చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని, డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని తెలిపారు. పాతర్లపాడకు చెందిన సీపీఎం నేత సామినేని రామారావును హత్య చేసిన వారిని శిక్షించాలని తాము గతంలోనే పోలీసు శాఖను కోరినట్లు వెల్లడించారు.
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్


