హతుడు సీపీఎం రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం.. హత్య జరిగింది డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం కావడంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో సీపీ సునీల్‌దత్ స్వయంగా రంగంలోకి విచారణ చేపట్టారు. ఘటనాస్థలి నుంచి కత్తి పౌచ్, రుమాలే కాక చెప్పులు స్వాధీనం చేసుకోగా, దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని సెల్‌టవర్ పరిధిలో రికార్డు అయిన సంభాషణల ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని భావించినా.. పాతర్లపాడు సమీపాన రైల్వేట్రాక్ ఉండడంతో వందలాది ఫోన్ నంబర్లు నమోదు కావడం వల్ల పురోగతి కానరాలేదు. ఆపై సీసీ పుటేజీలు పరిశీలించడంతో పాటు ఇతర సాంకేతికత సాయం తీసుకున్నాక ఫలితం దక్కక పోలీసులకు ఈ హత్య కేసు సవాల్‌గా మారింది.


