సత్తుపల్లిలో జరుగుతున్న 73వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు గురువారం రెండో రోజుకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి
34 జట్లు హాజరుకాగా.. క్రీడాకారులు విజయమే లక్ష్యంగా పోటాపోటీగా తలపడ్డారు. నువ్వా, నేనా అన్నట్లు పోటీల్లో తలపడిన
క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వాహకులు రాత్రి క్యాంప్ ఫైర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో పాటు
క్రీడాకారిణులు ఆటపాటలతో సందడి చేశారు. కాగా, టోర్నీ సెమీస్, ఫైనల్స్ శుక్రవారం జరగనున్నాయి. – సత్తుపల్లి
– 8లో


