ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

శిక్షణలో డీఈఓ వాసంతి

ఖమ్మంసహకారనగర్‌: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రారంభ దశలోనే గుర్తించేలా పాఠశాలల్లో స్క్రీనింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ డి.వాసంతి సూచించారు. ఖమ్మంలోని సైన్స్‌ మ్యూజియంలో బుధవారం ప్రశస్త్‌ యాప్‌పై ఏర్పాటుచేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్క్రీనింగ్‌–1ను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతీ విద్యార్థిని పరీక్షించి ప్రత్యేక అవసరాల కలిగిన పిల్లలను గుర్తిస్తే చికిత్స సులువవుతుందని చెప్పారు. విద్యాశాఖ సీఎంఓ బి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల్లో స్క్రీనింగ్‌–1 వంద శాతం పూర్తి చేసి 21 రకాల వైకల్యాలకు సంబంధించి ప్రశ్నలకు యాప్‌లో సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. సైన్స్‌ మ్యూజియం అధికారి శ్రీనివాస్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, ఐఈఆర్‌పీలు, టెక్నికల్‌ రిసోర్స్‌ టీచర్లు పాల్గొన్నారు.

ఐదు మండలాలకు

నీటి సరఫరా నిలిపివేత

కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నీటిశుద్ధి ప్లాంట్‌ నుంచి రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో దృష్ట్యా తాగునీటి ఇక్కట్లు రాకుండా ముందస్తు నిర్వహణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ క్రమాన నేలకొండపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో కొన్ని గ్రామాలకు గురు, శుక్రవారం తాగునీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. తిరిగి శనివారం సరఫరాను పునరుద్ధరిస్తామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

పథకాల అమలులో

అగ్రస్థానం

ఖమ్మం మామిళ్లగూడెం: సీ్త్ర, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి పథకాల అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన ఉందని శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అక్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన శాఖ అధికారులతో పథకాల అమలుపై సమీక్షించారు. పోషణ్‌ అభియాన్‌, మిషన్‌ వాత్సల్స్య పథకాల అమలు, పురోగతిపై చర్చించిన జేడీ జిల్లా అధికారులను అభినంందించారు. ఈకార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రమీల, పోషణ్‌ అభియాన్‌ రాష్ట్ర బృందం సభ్యులు రాహుల్‌, కల్పనతో పాటు సీడీపీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement