అర్హుల ఓట్లను పరిరక్షిస్తాం... | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లను పరిరక్షిస్తాం...

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

కూసుమంచి: అర్హత కలిగిన ప్రతీఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడమే ధ్యేయమని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకురాలు శ్రీదేవసేన తెలిపారు. కూసుమంచిలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ‘ఎస్‌ఐఆర్‌’ అమలుపై ఆమె కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి ఈఆర్‌ఓలతో సమీక్షించారు. ఈసందర్భంగా దేవసేన మాట్లాడుతూ ఫారం 6, 6ఏ,7, 8 పరిష్కారంలో తప్పులు దొర్లకుండా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, ఎన్‌ఐఆర్‌ల నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేపట్టాలని, అర్హులైన ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని సూచించారు. అంతేకాక ప్రతీ నియోజకవర్గంలో అఽత్యధిక ఓటు చేర్పులు, తొలగింపులు ఉన్న 20 పోలింగ్‌ కేంద్రాలను నమూనాగా తీసుకుని పునఃపరిశీలన చేపట్టాలని తెలిపారు. అలాగే, నోటీసుల జారీ, విచారణ చేపట్టాక రికార్డులు భద్రపర్చాలని ఈఆర్‌ఓలకు సూచించారు. ఇక ఎపిక్‌ కార్డుల పంపిణీ, యువ ఓటర్ల నమోదు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి కచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనలో పాలుపంచుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 10,85,927 మంది ఓటర్లకుగాను 99.99 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా గడువులోగా ‘సర్‌’ ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీజ, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఎస్‌డీసీ సదానందం, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, కూసుమంచి, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్లు సైదులు, జయచంద్ర, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు.

జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకురాలు

శ్రీదేవసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement