రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో విద్యుత్ తీగల చోరీ కలకలం రేపింది. మండలంలోని కోయచలక రోడ్డులోని వెంకటేశ్వర ఎస్టేట్ వెంచర్‌లో 30 విద్యుత్ స్తంభాలకు సంబంధించిన రూ.4లక్షల విలువైన తీగలతో పాటు కండక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి అపహరించారు. ఈ వైర్‌కు సరఫరా లేకపోవడంతో నిందితుల పని సులువు కాగా, పోలీసుస్టేషన్‌కు కిలో మీటరు పరిధిలోనే చోరీ జరగడం గమనార్హం. వెంచర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోటార్ల వైర్
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం సిద్ధారం రోడ్డులోని చల్లగుళ్ల నరసింహారావు పొలంలో జూన్‌లో ఓసారి మోటార్ వైరు చోరీకి గురైంది. మళ్లీ ఆదివారం రాత్రి మోటార్ల వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి ఎత్తుకెళ్లారు. గతంలో పట్టుబడినా వదిలేయడంతోనే మళ్లీ ఇలా చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
అజయ్‌తండాలో మోటార్
నేలకొండపల్లి: మండలంలోని అజయ్‌తండాకు చెందిన బి.వెంకటేశ్వరరావు మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన మంగళవారం పొలం వద్దకు వెళ్లగా రూ.40 వేల విలువైన మోటార్ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
రూ.4 లక్షల విలువైన
కండక్టర్, వైర్లు మాయం


