ఖమ్మం స్పోర్ట్స్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించారు. పోటీల్లో 19 బాలుర జట్లు, తొమ్మిది బాలికల జట్లు హాజరయ్యాయి. బాలుర విభాగంలో ఏన్కూరు, రెబ్బవరం జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలవగా, తుంబూరు, బనిగండ్లపాడు జట్లు మూడు, నాలుగో స్థానాలు దక్కింకున్నాయి. బాలికల విభాగంలో అడవిమల్లెల, ముష్టికుంట్ల, వీ.ఎం.బంజర, రెబ్బవరం జట్లు వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈమేరకు విజేతలకు డీఈఓ డి.వాసంతి, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.చిన్ని బహుమతులు అందజేశారు.


