వ్యవసాయ కూలీల ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కూలీల ట్రాక్టర్‌ బోల్తా

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

చింతకాని: పత్తి చేనులో పనికి వచ్చి వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడడంతో 22 మంది కూలీలు గాయపడ్డారు. మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పత్తి తీసేందుకు తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన కూలీలు సోమవారం ఉదయం వచ్చారు. పని ముగిశాక సాయంత్రం ట్రాక్టర్‌లో వెళ్తుండగా నాగులవంచ – తిమ్మినేనిపాలెం మధ్య రహదారిపై మూలమలుపు వద్ద అదుపు తప్పి ట్రక్కుతో పాటు బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న పత్తి బస్తాలతో సహా కూలీలు రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడ్డారు. పత్తి బస్తాలు కొందరు కూలీలపై పడడంతో కేకలు వేయగా అటుగా వెళ్తున్న వారు వచ్చి వారిని బయటకు తీశారు. ట్రాక్టర్‌ ఇంజన్‌ కింద ఇరుక్కుపోయిన డ్రైవర్‌ అతికష్టం మీద బయటపడ్డాడు. ఘటనలో కూలీలు నాదెండ్ల భారతమ్మ, రమాదేవి, వెంకమ్మ, కొమ్ము నిర్మలకు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా, మరో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను రెండు 108 వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

22 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement