చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో బుధవారం జరిగిన ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. ఖమ్మంకు చెందిన నిర్మల, నర్సింహారావు స్కూటర్‌పై హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నారు. మార్గమధ్యలో చిట్యాల బస్‌స్టేషన్ ఎదుట సర్వీస్ రోడ్డులో ఓ బస్సు ఆగి ఉండగా. వెనుక నుంచి ఢీకొట్టారు. ఘటనలో నిర్మల తలకు తీవ్ర గాయాలు కాగా.. నర్సింహారావుకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
బైక్ అదుపు తప్పడంతో యువకుడు మృతి
ఎర్రుపాలెం: మండలంలోని తెల్లపాలెం గ్రామానికి చెందిన వాగదాని వీరబాబు(23) బైక్ అదుపు తప్పగా తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. ఎస్‌ఐ ఎం.రమేష్‌కుమార్ తెలిపిన వివరాలు... వీరబాబు కండ్రిక నుండి ఎర్రుపాలెం గ్రామానికి వెళ్తుండగా జమలాపురం ఆర్చి వద్ద ఆయన బైక్ అదుపు తప్పడంతో కిందపడ్డాడు. ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలై అక్కడక్కడే మృతి చెందాడు. ఆయన తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు
కొణిజర్ల: మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికకు తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన వ్యాన్ డ్రైవర్ గోపాలకృష్ణ ఫోన్‌లో అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెట్టడమే కాక ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ వేధింపులు పలుమార్లు ఆమె తండ్రి మందలించినా మార్పు రాలేదు. దీంతో బాలిక తండ్రి ఈనెల 19న ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపారు.


