జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం శిక్షణ | - | Sakshi
Sakshi News home page

జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం శిక్షణ

Oct 22 2026 12:51 AM | Updated on Oct 22 2026 12:51 AM

ఖమ్మం రాపర్తినగర్‌: జర్మనీలో ఉద్యోగావకాశాలు ఉన్నందున నిరుద్యోగ యువతకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ(టామ్‌కం) ఆధ్వర్యాన జర్మన్‌ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్‌.మాధవి తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఓరిఝెంటేషన్‌ తరగతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఖమ్మం టీటీడీసీలో ఉదయం 10గంటలకు మొదలయ్యే తరగతుల్లో శిక్షణ, అర్హతలు, దరఖాస్తు విధానం వెల్లడించనున్నందున ఆసక్తి ఉన్న వారు నేరుగా హాజరుకావొచ్చని, వివరాలకు 63051 57085లో సంప్రదించాలని సూచించారు.

ఆలయ అభివృద్ధికి రూ.25వేల విరాళం

ఖమ్మం సహకానగర్‌: ఖమ్మం కాల్వొడ్డులోని ఎఫ్‌సీఐ గోదాం సమీపాన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వారధి ఫౌండేషన్‌ చైర్మన్‌ చింతనిప్పు కృష్ణచైతన్య రూ.25వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ఫౌండేషన్‌ మొదటి సేవా కార్యక్రమాన్ని వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహించామని తెలిపారు. ఫౌండేషన్‌ సభ్యులు ఎం.సాయి, చిక్కుళ్ల వెంకటేష్‌, పగిళ్లపల్లి రాజు, నాగరాజు, శివ, అర్చకుడు మేడూరి రవికుమార్‌ పాల్గొన్నారు.

సూపర్‌బజార్‌ ఉద్యోగులకు అందని అడ్వాన్స్‌

రుద్రంపూర్‌: సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్‌ చెల్లించిన యాజమాన్యం, కొత్తగూడెం డివిజన్‌ పరిధి సూపర్‌బజార్‌లలో ఉద్యోగులకు అడ్వాన్స్‌ మాత్రం ఇవ్వలేదు. పండుగ ముందు రోజు వరకు రూ.25వేలు వస్తాయని చూసినా, రాకపోవడంతో ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. కొత్తగూడెం డివిజన్‌లో 25 మంది పనిచేస్తుండగా, శ్రీరాంపూర్‌, గోదావరిఖనిలో చెల్లించిన యాజమాన్యం ఇక్కడి ఉద్యోగులను విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై సూపర్‌బజార్‌ డివిజన్‌ మేనేజర్‌ దేవదాస్‌ను వివరణ కోరగా.. లావాదేవీలు ఉన్నా, లేకున్నా ప్రతీనెల ఉద్యోగులకు రూ.2.70లక్షలకు పైగా వేతనాలు చెల్లిస్తున్న నేపథ్యాన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. రిటైర్‌ అయిన కార్మికులంతా వెళ్తుండడంతో ఇక్కడ సూపర్‌బజార్‌లో అమ్మకాలు, గ్యాస్‌ కనెక్షన్లు పడిపోయాయని తెలిపారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాను జీఎస్టీతో సంబంధం లేకుండా చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేయగా నాయకులు మాట్లాడుతూ పండుగ వరకు ఇదిగో, అదిగో అని చివరి వాటా చెల్లించకపోవడం సరికాదన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడి రూ.5,500 చొప్పున చెల్లించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement