ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం(ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 15నుంచి 18వ తేదీ వరకు సభలు జరగనుండగా, తొలిరోజు రెడ్‌షర్ట్ వలంటీర్లతో ప్రదర్శన, లక్ష మందికి పైగా రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహాసభల్లో భారత వ్యవసాయ రంగం, రైతాంగ భవిష్యత్తుపై చర్చలు జరిపి, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమాలకు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, మాదినేని రమేష్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్


