ట్రేడింగ్‌ పేరుతో రూ.10కోట్లకు కుచ్చుటోపి | - | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌ పేరుతో రూ.10కోట్లకు కుచ్చుటోపి

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

ఖమ్మంక్రైం: దుబాయ్‌లోని బంగారం కంపెనీ ట్రేడింగ్‌ పేరుతో ఖమ్మంలో పలువురిని నమ్మించి రూ.10కోట్ల మేర మోసం చేసిన ఘటన ఇది. ఈ అంశంపై ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం బాలాజీ నగర్‌కు చెందిన గోపతి యశ్వంత్‌ దుబాయ్‌కి చెందిన కంపెనీలో బంగారం ట్రేడింగ్‌కు పెట్టుబడులు పెట్టాలని, అక్కడి కరెన్సీ ప్రకారం అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించాడు. తొలినాళ్లలో కొందరికి లాభాలు చూపించడంతో వారితో పాటు ఇంకొందరు ముందుకొచ్చి సుమారు రూ.10కోట్ల మేర ఆయన ద్వారా పెట్టుబుడులు పెట్టారు. ఆతర్వాత ముఖం చాటేసిన యశ్వంత్‌ కంపెనీకి నష్టాలు వచ్చాయని, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదంటే తప్పించుకుని తిరుగుతున్నాడు.

రంగంలోకి కానిస్టేబుల్‌

బాధితులు యశ్వంత్‌ను నిలదీయడంతో ఖమ్మంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే కిరణ్‌కుమార్‌, మరో ఇద్దరి సాయం తీసుకుని వారికి వాటా ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆతర్వాత కానిస్టేబుల్‌ సాయంతో బాధితులను బెదిరించడం ప్రారంభించారు. ఈక్రమాన బాధితులంతా గత నెల 26వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించగా యశ్వంత్‌తోపాటు కానిస్టేబుల్‌ కిరణ్‌, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. అయితే, సదరు కానిస్టేబుల్‌ ఎఫ్‌ఐఆర్‌ చేసిన ఎస్‌ఐని కూడా బెదిరించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా వారు మందలించినట్లు తెలిసింది. కానీ గతనెల 30వ తేదీనే యశ్వంత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కానిస్టేబుల్‌పై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు ఉన్నతాధికారులను కలవాలనే యోచనలతో ఉన్నట్లు సమాచారం.

నిందితుల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement