అనుమానాస్పద మృతిగా కుటుంబీకులఫిర్యాదు
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన దారగాని ఉప్పలయ్య(37) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మూడేళ్లుగామిర్యాలగూడలోని ప్రైవేట్ పాల డెయిరీలో పనిచేస్తున్నాడు. కాగా, ఉప్పలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమాన మంగళవారం మిర్యాలగూడలోని నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని అక్కడి పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మరో ప్రమాదం
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మంగళవారం మరో ప్రమాదం జరి గింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శామో లి పరివార్ లిమిటెడ్ ప్రైవే ట్ ట్రావెల్స్ బస్సు హైవేపై వైరా మండలం సోమవరం వద్ద లారీని అతివేగంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఎగ్జిట్–4 వద్ద ఈ ఘటన జరగగా బస్సులోని 50మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ముందు లారీని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి నట్లు తెలుస్తోంది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి కుడి కాలిని తొలగించారు. ఈమేరకు ఎస్సై పి.రామారావు నేతృత్వాన పోలీసులు చేరుకుని ప్రయాణికులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరికి కాళ్లు, చేతులు, ఫ్రాక్చర్ కాగా, చికిత్స అందిస్తున్నారు.
8 కేజీల గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీ ల్లో ఎనిమిది కేజీల గంజాయి లభ్యమైంది. స్టేషన్‌లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శశికుమా రి ఆధ్వర్యాన మంగళవారం తనిఖీ చేస్తుండగా రెండో నంబర్ ప్లాట్‌ఫాం సమీపాన గంజా యిని గుర్తించారు. అయితే, గంజాయి తరలిస్తున్న వ్యక్తులు ఆచూకీ తెలియకపోవడంతో తదుపరి విచారణ కోసం ఎకై ్సజ్ స్టేషన్–2లో అప్పగించారు.


