67 మంది సీఆర్టీల బదిలీ | - | Sakshi
Sakshi News home page

67 మంది సీఆర్టీల బదిలీ

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

భద్రాచలంటౌన్‌: ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న సీఆర్టీల బదిలీ కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పరిశీలకుల కమిటీ సమక్షాన మంగళవారం ప్రక్రియ పూర్తిచేశారు. భార్యాభర్తలు, దివ్యాంగులు, వైద్యపరమైన సమస్యలు ఉన్నవారు, వితంతు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పీఓ తెలిపారు. మొత్తం 67 సీఆర్టీలను బదిలీ చేయగా, ఎలాంటి అవకతవకలకు జరగకుండా పర్యవేక్షించామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఖమ్మం డీడీ ఫిరంగి, ఏసీఎంఓ రాములు, ఏటీడీఓ రమేష్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

క్షతగాత్రుడికి

డీసీహెచ్‌ఎస్‌ చేయూత

ఖమ్మం వైద్యవిభాగం: రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకుడికి జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికా రి డాక్టర్‌ రాజశేఖర్‌ గౌడ్‌ అండగా నిలిచారు. ఖమ్మం కలెక్టరేట్‌ సమీపం నుంచి వెళ్తున్న వాటర్‌ క్యాన్ల ఆటో మంగళవారం బోల్తా పడగా, మధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయాన కలెక్టరేట్‌ నుంచి వెళ్తున్న డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌ గౌడ్‌ తన కారులో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అభిషేక్‌ కుడి తొడ భాగంలో ఎముక విరగగా, వైద్యులతో మాట్లాడి వైద్యం అందేలా సమన్వయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement