ఏన్కూరు: ఏన్కూరుకు చెందిన జువ్వాది మౌనిక కు డాక్టరేట్ లభించింది. కాకతీయ యూనివర్శిటి జంతుశాస్త్ర విభాగంలో ఆమె సమర్పించిన పరి శోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించినట్లు గురువారం కేయూ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఏన్కూరుకు చెందిన జువ్వాది శివయ్య – పద్మ కుమార్తె మౌనిక చిన్ననాటి నుంచే చదువులో రాణిస్తూ డాక్టరేట్ సాధించగా పలువురు అభినందించారు. కాగా, మౌనిక ప్రస్తుతం ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ, పీజీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
4న స్విమ్మింగ్ జట్ల
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా పాఠశాలల స్థాయి స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలు అక్టోబర్ 4న నిర్వహిస్తున్నట్లు క్రీడాసంఘం జిల్లా కార్యదర్శి.వై.రామారావు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికల జట్ల ఎంపికకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీబీ ఎస్‌ఈ, కేంద్రియ విద్యాలయ సమితి, విజ్ఞాన్ భారతి పాఠశాలల క్రీడాకారులకు అర్హత లేదని తెలిపారు. మిగతావారు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 89856 84841 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు అక్టోబర్ 1వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలి పారు. ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా 20 పోస్టులు భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, 18 – 40ఏళ్ల వయస్సు వారు అర్హులని, గురువారం టీటీడీసీ భవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
ఏజీ కళాశాలను
సందర్శించిన దేశీ డీలర్లు
అశ్వారావుపేటరూరల్: ఖమ్మం జిల్లాకు చెందిన దేశీ డీలర్ల(డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్) బృందం మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించింది. కళాశాలలోని వ్య వసాయ క్షేత్రాలు, ఉద్యాన పంటల ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించి ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై వివరాలు తెలు సుకున్నారు. అలాగే, పంటల దిగుబడి, ఆదా యం, కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటల సాగుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ నీలిమ, డాక్టర్ శివ మాట్లాడుతూ..రైతులకు నాణ్యమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడంలో డీలర్లు వారధిగా పనిచేయాలని సూచించారు.
విద్యుత్ ఉద్యోగుల
క్రీడాపోటీల్లో రన్నరప్
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా ఉద్యోగుల క్రీడాపోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సర్కిళ్ల మహిళా క్రీడాకారి ణులు రెండో స్థానం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం ఎస్‌ఈ ఈ. శ్రీనివాసాచారి, ఎస్‌ఏఓ శ్రీధర్ క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారిణుల అంకితభావం, జట్టు స్ఫూర్తి సర్కిల్‌కు గుర్తింపును తీసుకొచ్చాయని కొనియాడారు. జట్టులో లావణ్య, అలేఖ్య, సౌజన్య, సాగరిక, ఈశ్వరి, రజిని, మానస, ధాత్రి, మాధవి, భవాని, మౌనిక, సంధ్య, లక్ష్మీప్రియ, మైథిలి ఉండగా.. సాంస్కృతిక కార్యదర్శి ఎం.ప్రసాద్ పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో
ఏడాది జైలుశిక్ష
ఖమ్మం లీగల్: అప్పు ఇచ్చిన వ్యక్తికి జారీ చేసి న చెక్కు చెల్లకపోవడంతో చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన సిమ్మసర్తి వీరబాబుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడుకు చెందిన కందుల వీరబాబు వద్ద సిమ్మసర్తి వీరబాబు 2020 నవంబర్‌లో రూ. 10 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2022 నవంబర్‌లో చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో నగదు లేకపోవడం, సంతకం సరిపోలక బౌన్స్ అయింది. ఈమేరకున్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం సిమ్మసర్తి వీరబాబుకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదుదారుడికి రూ.12.70లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


