పెనుబల్లి: పాఠశాలల్లో విద్యార్థుల కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందజేయాలని జిల్లా పంచా యతీ అధికారి వినోద్‌కుమార్ సూ చించారు. మండలంలోని వీఎం బంజర్ ఉన్నత పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీచేశారు. పాఠశా లలో తనిఖీ సందర్భంగా హాజరుపై ఆరా తీశాక విద్యార్థులతో కలిసి భోజనం చేశా రు. భోజనం విషయంలో లోటుపాట్లు రాకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూ చించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఎం పీడీఓ వీరస్వామి, కార్యదర్శి శిరీష, హెచ్‌ఎం భాస్కర్‌రావు పాల్గొన్నారు.


