మధిర: పీఆర్‌టీయూ మధిర మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. యూని యన్ మండల అధ్యక్షుడిగా చిలుకూరి సత్యనారా యణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పోలె సుధాకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధిరలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. అలాగే, గౌరవ అధ్యక్షుడిగా కె.శాంతబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా ఎండీ.జమీర్, ఎం.నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లెల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తెల్లమేకల శ్రీనివాసరావు, చేడే సతీష్, మర్రి కృష్ణయ్య, డి.శ్యామలరావు, రాజు ఎంపికయ్యారు. మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా జ్యోతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు తదితరులు అభినందించారు.


