చింతకాని: మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం మొక్కలను పంపిణీ చేశాక ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకుని మరికొందరికి వివరించాలని చెప్పారు. సర్పంచ్ వత్సవాయి పద్మ, ఉపసర్పంచ్ మేకల నిర్మల, అకడమిక్ మానిటరింగ్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం దొండపాటి శ్రీనివాస్‌తో పాటు మాదాసు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


