రక్తదానానికి యువత ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

రక్తదానానికి యువత ముందుకు రావాలి

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

ఖమ్మం వైద్యవిభాగం: ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాల సమయంలోనే కాక తలసేమియా బాధితులకు అండగా నిలిచేలా యువత రక్తదానం చేయాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను డీఎంహెచ్‌ఓ ప్రారంభించి మాట్లాడారు. ఒక్క యూనిట్‌ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. 18 – 65 ఏళ్ల మధ్య వయస్సు, 45 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే ఆరోగ్యవంతులైన సీ్త్ర, పురుషులెవరైనా 3–4 నెలలకోసారి రక్తదానం చేయొచ్చని చెప్పారు. ఈమేరకు రక్తదానం ఆవశ్యకతపై విద్యార్థులు, వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ప్రవీణ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌గౌడ్‌, బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement