మెడికల్‌ కాలేజీలో కొత్త విద్యాసంవత్సరం ! | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీలో కొత్త విద్యాసంవత్సరం !

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

ఖమ్మం వైద్యవిభాగం: క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలుచేస్తూ, వైద్యసేవలందించే సంస్థలు నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ దరఖాస్తులను పరిశీలించాక అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమతుల సమయాన పార్కింగ్‌ సౌకర్యాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే 16 డయాగ్నస్టిక్‌ కేంద్రాలను తనిఖీ చేయగా పలు లోపాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసి లోపాలను సరిదిద్దుకునేలా గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఆ సమయంలో లోపాలను సరిచేయకపోతే రిజిస్ట్రేషన్‌ ఇవ్వొద్దని, ఆ తర్వాత చట్టప్రకారం సీజ్‌ చేయాలని స్పష్టం చేశారు. కాగా, ప్రొవిజనల్‌ రిజిస్ట్రేషన్‌కు 29, పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌కు అందిన 52 దరఖాస్తులపై సమీక్షించారు. ఈసమావేశంలో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరాస్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. తొలుత సోమవారం నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు ఇంట్రడక్షన్‌ తరగతులు ఉంటాయని, 5వ తేదీ నుంచి బోధన మొదలవుతుందని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు తెలిపారు. నీట్‌ ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర కోటా 85సీట్లకు గాను 81 మంది విద్యార్ధులు ప్రవేశం పొందగా, వీరిలో జనరల్‌తో పాటు వివిధ కేటగిరీల కింద 60వేలు మొదలు 4,63,757 ర్యాంక్‌ వచ్చిన విద్యార్థులు ఉన్నారు. మరో రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యే సరికి జాతీయ కోటాతో పాటు రాష్ట్ర కోటా కలిపి 100 మంది సీట్లు భర్తీ కానున్నాయి. ప్రస్తుతం చేరిన 81మందిలో 58 మంది బాలికలు ఉండగా.. కొందరు నేరుగా, మరికొందరు ఆన్‌లైన్‌లో ఇంట్రడక్షన్‌ తరగతులు వింటున్నారని ప్రిన్సిపాల్‌ చెప్పారు. కాగా, విద్యార్థినుల వసతికి జెడ్పీ గెస్ట్‌ హౌస్‌ కింది ఫ్లోర్‌లో కొంత భాగం కేటాయించినా సరిపోకపోవడంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు గెస్ట్‌హౌస్‌ మొత్తాన్ని బాలికల హాస్టల్‌కు కేటాయించగా బంగ్లాను స్వాధీనం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

ఏన్కూరు: రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఎరువులు అంటగడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. ఏన్కూరు మండలంలోని జన్నారం, నూకలంపాడు, ఏన్కూరు, బురదరాఘవాపురం, తిమ్మారావుపేట, తూతకలింగన్నపేటల్లో ఎరువులు, పురుగుమందుల షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్‌ రిజిస్టర్లు, లైసెన్స్‌, ఇతర రికార్డులను పరిశీలించి మాట్లాడారు. అమ్మకాల్లో నిబంధనలు పాటించడమే కాక ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ నర్సింహారావు, ఏఈఓ బాలకృష్ణ పాల్గొన్నారు.

ప్రమాణాలకు

అనుగుణంగా నిర్వహణ

డీలక్స్‌ బస్సులకు

ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం – భద్రాచలం, ఖమ్మం – సత్తుపల్లి మార్గాల్లో నడిచే డీలక్స్‌ బస్సులకు బుధవారం నుంచి ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను అమలు చేస్తున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్‌ శివప్రసాద్‌ తెలిపారు. ఖమ్మం – భద్రాచలం డీలక్స్‌ బస్సు చార్జీ రూ.180 ఉండగా, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌ మాదిరి రూ.170, ఖమ్మం – సత్తుపల్లి మార్గంలో రూ.130కి బదులు రూ.120కి తగ్గించినట్లు పేర్కొన్నారు. ఆయా మార్గాల్లో మిగతా అన్ని స్టేజీలకు కూడా ఎక్స్‌ప్రెస్‌ చార్జీలే వర్తించనున్నందున ప్రయాణికులు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement