తగ్గేదే.. లేదు! | - | Sakshi
Sakshi News home page

తగ్గేదే.. లేదు!

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

అయినా మారని కొందరి తీరు ఇష్టారాజ్యంగా ధాన్యం, బియ్యం తరలింపు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) వ్యవహారంలో మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఇటీవల జిల్లాలోని పలు మిల్లుల్లో విజిలెన్స్‌ తనిఖీ చేపట్టినా అక్రమాలు మాత్రం ఆపడం లేదు. మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు భారీ స్థాయిలో సీఎంఆర్‌ బకాయి ఉన్నా, బియ్యాన్ని యథేచ్ఛగా ఇతర మిల్లులకు తరలిస్తున్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు సమీపంలోని ఓ మిల్లులో ఇలాంటి వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.

ధాన్యం ఇస్తే.. బియ్యం ఇచ్చేలా

రేషన్‌ షాపులతోపాటు మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యాన్ని వినియోగిస్తోంది. ఇందుకోసం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు కేటాయిస్తున్నారు. మిల్లర్లు 100 కేజీల ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని సీఎంఆర్‌గా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. కానీ కొన్నేళ్లుగా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో అందించడం లేదు. గడువు ముగిస్తే మళ్లీ పొడిగించ డం.. అయినా తీరు మారకపోవడం పరిపాటిగా మారింది.

మిల్లర్లపై విజిలెన్స్‌ కన్ను

సీఎంఆర్‌ అప్పగింతలో మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి తరచూ గడువు పెంచడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సీజన్‌లో ఇదే పునరావృతం అవుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సీఎంఆర్‌ బకాయి ఉన్న మిల్లుల్లో గత ఏడాది హైదరాబాద్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమాలే నిజమేనని తేలిన మిలర్లకు జరిమానా విధించారు. ఈ ఏడాది కూడా కొన్ని మిల్లుల్లో తనిఖీలు చేసి సీఎంఆర్‌లో తేడాలు గుర్తించారు. మూడు మిల్లులపై కేసులు నమోదు చేశారు.

అంతా మా ఇష్టం..

ఇంత జరుగుతున్నా మిల్లర్లు మాత్రం సీఎంఆర్‌ అప్పగింతపై ఉదాసీనత వీడడం లేదు. సీఎంఆర్‌ చెల్లించకపోవడమే కాక తమ మిల్లుల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని బయటకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయకపోగా సొంత బియ్యంలా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు సమీపంలోని ఓ మిల్లు నుంచి 35 లారీల బియ్యం బయటకు వెళ్లగా .. ఉద్యోగులు సోమవారం రాత్రి తనిఖీ చేశారు. ఆ సమయాన లోడ్‌తో ఉన్న మూడు లారీలను సీజ్‌ చేయడమేకాక మిల్లు ప్రధాన గేటుకు తాళం వేశారు. ఇదే తరహాలో పలువురు మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యాన్ని విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా మిల్లుల్లో వరుసగా విజిలెన్స్‌ దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement