ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతే కీలకం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతే కీలకం

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

ఖమ్మం సహకారనగర్‌: ఖరీఫ్‌లో సాగైన ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై అదనపు డీసీపీ ప్రసాదరావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్రాల ఏర్పాటు, నాణ్యత పరిశీలన, రవాణా, నిల్వలపై దృష్టి సారించాలని తెలిపారు. గతానికి భిన్నంగా ఈసారి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లలోని గోదాములతో పాటు గుర్తించిన ప్రదేశాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. ఆతర్వాత బ్యాంకు గ్యారంటీలు చెల్లించి, పెండింగ్‌ సీఎంఆర్‌ బియ్యం ఇచ్చిన రైస్‌ మిల్లులకే ధాన్యం కేటాయింపులు ఉంటాయని తెలిపారు. అలాగే, ఎంపిక చేసిన ఏడు సన్న రకాలకే బోనస్‌ ఇవ్వనున్న విషయమై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 325 కొనుగోలు కేంద్రాలను వచ్చే నెల 1నుంచి ప్రారంభానికి సిద్ధం కావాలని తెలిపారు. తొలుత కొనుగోళ్లు, లోడింగ్‌, ఆన్‌ లోడింగ్‌పై రూపొందించిన యాప్‌పై అవగాహన కల్పించారు. పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్‌, డీసీఓ గంగాధర్‌, సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు ప్రభుత్వ

ప్రయోజనాలు

ఖమ్మం లీగల్‌: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలో మంగళవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడాక గ్రామంలో పర్యటించారు. ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు 644 దరఖాస్తులు అందాయని తెలిపారు. వచ్చేనెల 1న గ్రామంలో బీమా కార్డుల నమోదు, ఆధార్‌ సేవల కోసం ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేస్తామని న్యాయమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement