ఖమ్మంక్రైం: వివిధ పోలీస్‌స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పలువురిని సీపీ సునీల్‌దత్ సోమవారం అభినందించారు. 2000 బ్యాచ్‌కు చెందిన 13మందికి పదోన్నతి లభించింది. ఇందులో మహబూబాబాద్ జిల్లాకు ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏడుగురిని కేటాయించారు. పదోన్నతి పొందిన వారిలో టి.శ్రీనివాసరావు, శ్రీనివాస్, రవికుమార్, ముత్తయ్య, వడ్డే కిషోర్, కరుణాకర్‌రావు, నవజీవన్‌కుమార్, సుశీల్‌కుమార్, అలు, శ్రీనివాసరావు, రవికుమార్, సీతారామరాజు, సర్దార్ సింగ్ ఉన్నారు.


