బార్‌ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బార్‌ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఖమ్మంక్రైం / కల్లూరు రూరల్‌: జిల్లాలోని కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో బార్‌ ఏర్పాటుకు అనుమతి మంజూరైంది. ఈమేరకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష రుసుముతో వచ్చే నెల 12వ తేదీలోగా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం, సూపరింటెండెంట్‌ కార్యాలయం లేదా హైదరాబాద్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 39 బార్లు ఉండగా కల్లూరులో ఏర్పాటయ్యే బార్‌తో ఈ సంఖ్య 40కి చేరుతుంది. ఈ బార్‌కు ఏటా రూ.30లక్షల లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా కేటాయిస్తారు.

విత్తనోత్పత్తిలో

జాగ్రత్తలతో లాభాలు

వైరా: రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటిస్తే లాభాల బాట పట్టొచ్చని వైరా కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పావని తెలిపారు. కేవీకే ఆధ్వర్యాన మంచుకొండ కోపరేటివ్‌ సొసైటీలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ పంటల వారీగా విత్తనోత్పత్తి, జాగ్రత్తలను వివరించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ సుధాకర్‌ మాట్లాడగా సెక్రటరీ శ్రీనివాసరావు, సీఈఓ శ్రీనివాసరావు, రైతు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సంఘంపై

దుష్ప్రచారం సరికాదు

ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన ప్రతీసారి కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం అలవాటుగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అధికారం వచ్చినప్పుడు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. బోగస్‌ ఓట్లు, నకిలీ నమోదు, అర్హత లేని వ్యక్తుల పేర్లను తొలగించే చర్యలపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం గర్హనీయమని, ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు భూక్యా శ్యాంసుందర్‌నాయక్‌, మేకల నాగేందర్‌, మందడపు సుబ్బారావు, నున్నా రవికుమార్‌, రవిరాథోడ్‌, రవిగౌడ్‌, హఠయనాయక్‌ పాల్గొన్నారు.

రేపు కొత్తగూడెంలో

క్రీడా జట్ల ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–14, 17 బాలబాలికల రెజ్లింగ్‌ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 30న కొత్తగూడెంలో జరగనున్నాయి. రుద్రంపూర్‌లోని సీఈఆర్‌ క్లబ్‌లో ఈ పోటీలు జరుగుతాయని జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శులు వై.రామారావు, బి.బావ్‌సింగ్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని, వివరాలకు 99497 61181 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement