గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు సమీపాన సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. వైరా మున్సిపాలిటీ శివారు శాంతినగర్‌కు చెందిన మాడపాటి నరసింహారావు(35) రోజులాగే సోమవారం తెల్లవారుజామున ఖమ్మం మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకుని ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పల్లిపాడు స్వర్ణభారతి కోల్డ్‌ స్టోరేజీ సమీపాన గుర్తుతెలియని వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఆతర్వాత వాహనం ఆయన తల పైనుంచి వెళ్లడంతో నరసింహారావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్‌ మృతి

ఖమ్మంక్రైం: ద్విచక్ర వాహనాన్ని వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన తండ వెంకటేశ్వర్లు(53) ఈనెల 26న తన ద్విచక్రవాహనంపై ధంసలాపురం వెళ్లి వస్తుండగా ఓ వెంచర్‌ మూల మలుపు వద్ద ధంసలాపురం వైపు వేగంగా వెళ్తున్న చేపల వ్యాన్‌ ఢీకొట్టింది. ఈక్రమాన గాయపడిన వెంకటేశ్వర్లును ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, ఆయని ఇచ్చిన సమాచారంతో కుటుంబీకులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా, వెంకటేశ్వర్లు భార్య పుష్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు తెలిపారు.

తాటిపూడిలోని రెండిళ్లలో చోరీ

వైరారూరల్‌: మండలంలోని తాటిపూడి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన పతాని సునీత పది రోజుల క్రితం వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లింది. ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సోమవారం చేరుకోగా, ఇంట్లో ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కిలోల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. గ్రామానికే చెందిన దోసపాటి రాజేశ్వరరావు హైదరాబాద్‌ వెళ్లగా చోరీ జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈమేరకు సమీపంలో నివాసముండే ఆయన కుమారుడు రాజేశ్వరరావు కుమారుడు పరిశీలించి రెండు తులాల బంగారు ఆభరణాలను చోరీ జరిగినట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో వైరా ఎస్సై పుష్పాల రామారావు, ఎస్సై–2 వెంపటి పవన్‌ సోమవారం ఉదయం క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement