సీఎంఆర్‌ ధాన్యం బయటకు తరలింపు! | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ ధాన్యం బయటకు తరలింపు!

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

నేలకొండపల్లి: మిల్లులో ఉండాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ధాన్యం పక్కదారి పట్టింది. సమాచారం అందుకుని వచ్చిన ఉద్యోగులు లారీలను అడ్డుకోవడంతో పాటు మిల్లు ప్రధాన గేట్‌కు తాళం వేశారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు సమీపాన ఓ మిల్లు నుంచి గత వారం క్రితం సీఎంఆర్‌ ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించారని తెలిసింది. తొలుత వివిధ గ్రామాల్లోని మిల్లుల నుంచి కొత్తకొత్తూరు మిల్లు యాజమాన్యం దాదాపు 20 వేల క్వింటాల ధాన్యం తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆతర్వాత మిల్లర్ల మధ్య విబేధాలతో ధాన్యం తిరిగి తరలించినట్లు సమాచారం. దాదాపు 35 లారీల ధాన్యం బయటకు వెళ్లగా... విషయం తెలియడంతో సివిల్‌ సప్లయీస్‌ డీటీ విజయ్‌బాబు సోమవారం రాత్రి మిల్లుకు వచ్చారు. ఆ సమయానికి ధాన్యం లోడ్‌తో ఉన్న మూడు లారీలను సీజ్‌ చేయడంతో పాటు మిల్లు ప్రధాన గేట్‌కు తాళాలు వేశారు. ఈ విషయమై డీటీ మాట్లాడుతూ సమాచారం అందగానేవచ్చి మూడు లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. మిల్లుకు కేటాయిచింన ధాన్యం, ఇప్పటికే ఇచ్చిన సీఎంఆర్‌, ఇతర వివరాలపై మంగళవారం విచారణచేస్తామని వెల్లడించారు.

పరిశీలించి మిల్లుకు తాళం వేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement