గిన్నిన్ రికార్డులో ఖమ్మం వాసి, ఆయన ఫోటోతో పోస్టల్ స్టాంప్
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన డాక్టర్ జావేద్ రైతుల సంక్షేమం, సాంకేతిక విజ్ఞానం, పరిశోధన, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. గతంలోనూ ఓ గిన్నిస్ రికార్డు సాధించిన ఆయన తాజాగా మరో రికార్డు నమోదు చేశారు. భూమిబంధన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా 40కిపైగా గ్రామాల్లో రైతులకు మార్గదర్శకత్వం అందించిన జావేద్.. డ్రిప్ ఇరిగేషన్, పంటల తెగుళ్ల గుర్తింపు, పరిష్కారానికి సాంకేతిక పరిష్కారాల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో 15కిపైగా అంతర్జాతీయ సదస్సుల్లో కీలక ప్రసంగాలు చేసిన ఆయన పేరు గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది. అంతేకాక ఆయన పేరుతో రూ.5 విలువైన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను తమిళనాడు పోస్టల్ విభాగం విడుదల చేసింది. ఈ స్టాంప్‌లను లండన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సీఈఓ, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ పారిన్ సోమాని, మలేషియాలోని యూఓడబ్ల్యూ కేడీయూ పెనాంగ్ యూనివర్సిటీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ కెప్టెన్ డాక్టర్ జాషువా లూ టెక్ విడుదల చేశారు.


