వీల్ చైర్‌కే పరిమితమైన ఈ దివ్యాంగురాలు బాదావత్ త్రివేణికి ఆధార్ కార్డు లేక అవస్థ పడుతోంది. కూసుమంచి మండలం గైగోళ్లపల్లి లాల్‌సింగ్ తండాకు చెందిన ఆమె ఆధార్ కార్డును మూడేళ్ల క్రితం సర్వర్ నుంచి తొలగించారు. దీంతో పింఛన్, ప్రభుత్వ పథకాలు నిలిచిపోగా.. మళ్లీ దరఖాస్తుకు ప్రయత్నిస్తే ‘రిజెక్ట్’అని వస్తోంది. దీంతో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు విన్నవించుకుంది. ప్రత్యేక కేసు కింద దరఖాస్తు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చారని త్రివేణి తల్లిదండ్రులు తెలిపారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్


