621 కేంద్రాల్లో హాజరైన 26,726మంది
ఖమ్మం సహకారనగర్: నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్)’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈమేరకు అభ్యాసకులకు జిల్లాలోని వివిధ గ్రామపంచాయతీలు, పాఠశాలల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 621 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు వారికి అనుకూలమైన సమయాల్లో పరీక్ష రాసే వెసలుబాటు కల్పించారు. ఈక్రమాన 30,143మందికి గాను 26,726మంది పరీక్ష రాశారు. జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. కాగా, 25–30ఏళ్ల మహిళలు మొదలు వృద్ధుల వరకు పరీక్షకు ఆసక్తిగా హాజరుకావడం విశేషం.


