ఖమ్మం రాపర్తినగర్: ప్రకృతి అందాలకు జిల్లా నెలవుగా ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈమేరకు ప్రకృతిని ఆస్వాదించేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ఖిల్లా, పులిగుండాల, నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం వంటి ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు ఉన్న నేపథ్యాన ఈ ఖ్యాతిని నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం డీఐఈఓ రవిబాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ ఏటా పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామనితెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆతర్వాత విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పర్యాటక దినోత్సవంలో డీఎఫ్‌ఓ అనూజ్


