ఉమ్మడి జిల్లా అండర్‌–19 క్రీడా జట్లు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా అండర్‌–19 క్రీడా జట్లు సిద్ధం

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–19 వాలీబాల్‌, టేబుల్‌టెన్నిస్‌, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికకు జూనియర్‌ కళాశాల క్రీడా సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలకు 330 మంది క్రీడాకారులు హాజరుకాగా, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, డీఐఈఓ రవిబాబు, వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.గోవిందారెడ్డి, క్రీడా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం పోటీలను పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ బాలుర జట్టుకు విష్ణువర్దన్‌, రామ్మూర్తి, కేశవనందన్‌, లోకేష్‌, జాన్‌ వెస్లీ, రియాజ్‌, హర్షవర్దన్‌, దినేష్‌కుమార్‌, వివేక్‌, షరీఫ్‌, శ్యామ్‌, బాలికల జట్టుకు అంబిక, హాజసిని, సురేఖ, హర్షిత, నందనమ్మ, నాగేశ్వరి, అనూష, సుమిత్రనందన్‌, తనుజ, షణ్ముఖి, లక్ష్మి, వర్ష, కీర్తన, జ్యోత్స్న ఎంపికయ్యారని తెలిపారు. అలాగే, టేబుల్‌ టెన్నిస్‌ బాలుర జట్టులో రణదేవ్‌రెడ్డి, ప్రజ్ఞ రకూల్‌, హర్ష, సాయి ఠాకూర్‌, బాలికల జట్టులో జి.సిరి, ఆరాధ్య, అనన్య, అమృత, సాయిప్రియ, దివ్యకు స్థానం దక్కింది. ఇక కరాటే బాలుర జట్టుకు నివేదిత్య సాయి, నాగదీక్షిత్‌, షణ్ముఖసాయి పులి అకాష్‌, సూర్యతేజ, కృష్ణతేజ, రూపక్‌ శివచైతన్య, సాహిత్‌, అసుర్దీన్‌, రియాజ్‌, బాలికల జట్టులో భవిత, శ్రీభవ్య, హాసనిని, సాయికుమారి, లక్ష్మి జశ్విత, శ్రీకృత, శ్రీ విద్య ఎంపికయ్యారు. అసోసియేషన్ల బాధ్యులు సాంబమూర్తి, గోపతి సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement