కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదా నికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రిజిల్లా ము లకలపల్లి మండలం రాజుగూడెంకు చెందిన గోనెల రాజేష్(22) ఖమ్మం వైఎస్‌ఆర్ కాలనీలో ఉంటూ వైరాలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివా రం ఉదయం రాజుపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తనికెళ్ల వద్ద ఫోన్ రావడంతో యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ సమయాన వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో రాజేష్ తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆయన తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి పుష్ప కూలీ పనులకు వెళ్తూ చదివించింది. అటవీ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న యువకుడి మృతి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
చింతకాని: రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన కాడమంచి భాస్కర్(45) ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయన ఈనెల 18వ తేదీన ద్విచక్ర వాహనంపై ఏపీలోని మక్కపేట వెళ్లి తిరిగి వస్తుండగా నాగులవంచ సమీపంలోకి వాహనం అదుపు తప్పగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఘటనలో తలకు తీవ్ర గాయాలైన భాస్కర్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఆయన బంధువు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.


