మోదీ పాలనను నిరసిస్తూ ‘జైల్‌ భరో’ | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనను నిరసిస్తూ ‘జైల్‌ భరో’

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశంలో మోదీ పాలనను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. ఈమేరకు అక్టోబర్‌, నవంబర్‌లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాక డిసెంబర్‌ 2, 3, 4 తేదీల్లో జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో శనివారం ఏనుగు గాంధీ అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అనుబంధంగా మార్చడంతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎన్నికల సంఘం సహా వివిధ సంస్థలు స్వతంత్రను కోల్పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీల అమలులో విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్‌ నాయకులు సిఫారసు చేసిన వారికి కాకుండా అర్హులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే, వృథాగా పోతున్న వర్షపు నీటిని చెరువులకు మళ్లించాలని, సాగర్‌ ఎడమ కాలువ వచ్చే జలాలను చెరువులు, కుంటలు నింపాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు మహ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందే..

ఖమ్మం మామిళ్లగూడెం: ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఖమ్మంలో రాస్తారోకో నిర్వహించగా ఆయన మాట్లాడారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో

హేమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement